- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీకు నీతి ఎక్కడిది... కేటీఆర్‌పై సీతక్క ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. జీన్స్ అనేది పుట్టుకకు సంబంధించింది అని మరి మీ పార్టీలో అప్పుడు చేర్చుకున్న వాళ్లకు ఏం జీన్స్ ఉన్నాయని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. జీన్స్ అనేది పుట్టుకకు సంబంధించింది అని మరి మీ పార్టీలో అప్పుడు చేర్చుకున్న వాళ్లకు ఏం జీన్స్ ఉన్నాయని ప్రశ్నించారు. నాడు రాజ్యాంగ ఉల్లంఘన చేసి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న నువ్వు ఇవ్వాళ కోర్టుకు వెళుతున్నావా. కేటీఆర్ నీకు నీతి ఎక్కడిది అని ప్రశ్నించారు. రాజీనామా చేయకుండానే మీ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మీ పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా అని అడిగారు. మీకు దమ్ముంటే అప్పుడు మీ పార్టీలో జాయిన్ అయి ఇప్పుడు పదవిలో ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయమను అంటూ సవాల్ చేశారు. ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లే అర్హత మీకు లేదని అన్నారు. 2014, 2018లో భయపెట్టి, బెదిరించి టార్చర్ చేసి సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలను మీ పార్టీలోకి తీసుకోలేదా అని నిలదీశారు. యూట్యూబ్‌లు పెట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించిన మాత్రాన తమకు ఏమీ కాదన్నారు. మీరేం చేశారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.






