- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసంగికి ఎరవుల కొరత లేకుండా సర్కార్ చర్యలు
యాసంగి సీజన్ కు రైతులకు ఎరువుల కొరత రాకుండా సర్కారు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్ కు రైతులకు ఎరువుల కొరత రాకుండా సర్కారు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నది. ఎరువుల పంపిణీకి మార్క్ ఫెడ్ తోపాటు, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆగ్రోస్ ను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పంట కాలం నుంచి రైతులకు ఎరువులు మరింత సులువుగా లభ్యమవుతాయని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరముండదని పేర్కొంటున్నారు. కాగా, ఫిబ్రవరి నుంచి ఆగ్రోస్ నేరుగా కంపెనీల నుంచి ఎరువులను తీసుకొచ్చి రైతులకు విక్రయించనుంది.
ఏటా 36లక్షల టన్నుల ఎరువులు పంపిణీ
రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్ల కు ప్రతి సంవత్సరం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ ఫెడ్ మొత్తం 36 లక్షల టన్నుల ఎరువులు (యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్, సల్ఫర్) కంపెనీల నుంచి తీసుకువచ్చి.. గోదాముల్లో నిల్వ చేస్తుంది. అక్కడ నుంచి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో ఆగ్రోస్ సేవా కేంద్రాలు 987 ఉన్నా.. పదేళ్ల నుంచి 415 కేంద్రాల ద్వారానే పంపిణీ జరుగుతున్నది. దీంతో ఎరువుల పంపిణీకి తమ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలంటూ ప్రభుత్వానికి ఆగ్రోస్ ఉన్నతాధికారులు రెండునెలల క్రితం కోరగా.. స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
ఎరువుల పంపిణీకి మరో నోడల్ ఏజెన్సీగా ఆగ్రోస్ ను ఎంపిక చేసిన సమాచారాన్ని వారం రోజుల్లో కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ, ఎరువుల కంపెనీలకు అందిస్తారని సమాచారం. దీంతో ఆయా కంపెనీలు మార్క్ ఫెడ్ తోపాటు ఆగ్రోస్ కు ఇండెంట్ మేరకు నేరుగా ఎరువులను సరఫరా చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 925 సహకార సంఘాలు, 400 ఆగ్రోస్ కేంద్రాల ద్వారా ఎరువులను విక్రయిస్తున్నారు. మరో ఐదు వేల వరకు ప్రైవేటు ఎరువుల దుకాణాలుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో ఎరువులు లభ్యంకాక వాటిని రైతులు ఆశ్రయిస్తున్నాయి. ఈ తరుణంలో ఆగ్రోస్ సొంతంగా ఎరువుల పంపిణీ చేపడితే.. కేంద్రాల సంఖ్య 987కు పెరగడమే కాకుండా అదనంగా ఎరువులు మరిన్ని లభించే వీలుంటుందని వ్యవసాయ శాఖ భావిస్తున్నది.






