ఏపీలో BRS పోటీపై సజ్జల కీలక వ్యాఖ్యలు..

by Disha Web Desk 19 |
ఏపీలో BRS పోటీపై సజ్జల కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని.. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ ఏపీలో మా మద్దతు కావాలని అడిగితే.. ఈ విషయంపై అందరితో చర్చించి జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏపీ ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. తాము ఎవరితో పొత్తులు పెట్టుకునేది లేదని సజ్జల తేల్చి చెప్పారు. త్వరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏ రాష్ట్రాల్లో పోటీ చేయలనుకోవడం లేదని.. అందుకే తెలంగాణలో పోటీ చేయకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించమని పేర్కొన్నారు. ఒక వేళ తాము ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటే తమిళనాడులోనూ పోటీ చెయొచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా.. కుదిరితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలవాలని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సజ్జల చేసిన సమైక్యాంధ్ర వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు భగ్గమంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతలు సైతం సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కొత్త వివాదాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : CM KCR Big Plan: ఏపీలో బీఆర్ఎస్ హామీలు ఇవే..!

Next Story

Most Viewed