టీచర్ పోస్టుల భర్తీపై కేసీఆర్ హామీని గుర్తుచేసిన ఆర్‌ఎస్‌పీ (వీడియో)

by Disha Web Desk 2 |
టీచర్ పోస్టుల భర్తీపై కేసీఆర్ హామీని గుర్తుచేసిన ఆర్‌ఎస్‌పీ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ఏడేళ్ల నుంచి డీఎస్సీ వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులతో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన 2022 అసెంబ్లీలో ఉపాధ్యాయ ఖాళీల ప్రకటనపై కేసీఆర్ మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ టీచర్ పోస్టుల గురించి అసెంబ్లీలో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినట్లు ఆర్ఎస్పీ గుర్తుచేశారు. కానీ నేడు 5 వేల అరకొర, చాలిచాలని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారని తెలిపారు.

నవంబర్ దాకా లైసెన్సు ఉన్నప్పటికీ, ముందస్తుగా మద్యం టెండర్లు నిర్వహించి రూ.2, 500 కోట్లు సంపాయించాలని ఉన్నపుడు, రిటైర్మెంట్, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ లొనే కలిపి ఇచ్చిన మాట ప్రకారం 13,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తే మీ సొమ్మేం పోతుంది కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చూస్తే పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం‌కు తరలిస్తున్నారని, కనీసం బీఎడ్ డీఎడ్‌ల బాధను కూడా చెప్పుకోనివ్వరా? అని ప్రశ్నించారు. పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed