RS Praveen Kumar ఇన్ యూఎస్.. NRI లతో ప్రత్యేక సమావేశం

by Disha Web Desk 2 |
RS Praveen Kumar Visits US
X

దిశ, డైనమిక్ బ్యూరో: RS Praveen Kumar Visits US| భారత 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాలుగు వారాల పాటు యూఎస్‌, కెనడాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బోస్టన్ విమానాశ్రయంలో గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐల ఫోరమ్ ప్రవీణ్ కుమార్‌కు మంగళవారం ఘనంగా స్వాగతం పలికింది. నాలుగు వారాలపాటు యూఎస్‌లో ఉండి అన్ని ప్రాంతాలను సందర్శించనున్నారు. దాదాపు 10 ప్రధాన నగరాల్లో ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అంతేకాకుండా యూఎస్‌లో జరగనున్న 75వ భారత వజ్రోత్సవ వేడుకల్లోనూ పాల్గొననున్నట్లు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 'యూఎస్‌లోని బోస్టన్ నుండి ట్విట్టర్‌ స్పేస్ లైవ్‌లో నాతో చేరండి' అంటూ ట్వీట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. అయితే, యూఎస్ పర్యటనలో భాగంగా ప్రవీణ కుమార్ తన లక్ష్యాన్ని, దార్శనికతను వివరించడానికి ఎన్ఆర్ఐలతో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమలను మార్చడంలో సహాయపడటానికి ప్రవీణ్ కుమార్ ఎన్ఆర్ఐలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

పర్యటన షెడ్యూల్

బోస్టన్, ఎంఏలో (ఆగస్టు 15 నుండి 19 వరకు)

న్యూయార్క్/న్యూ జెర్సీలో (ఆగస్టు 20 నుండి 22 వరకు)

నార్త్/సౌత్ కరోలీనాలో (ఆగస్టు 23 నుండి 24 వరకు)

చికాగో ఐఎల్‌లో (ఆగస్టు 25 నుండి 26 వరకు)

వాషింగ్టన్/ డీసీ/ వీఏ/ ఎండీలో (ఆగస్టు 27 నుండి 28 వరకు)

డిట్రాయిట్ ఎంఐలో (ఆగస్టు 29 నుండి 30 వరకు)

డల్లాస్ టీఎక్స్‌లో (ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు)

అట్లాంటా జీఏలో (సెప్టెంబర్ 3 నుండి 4 వరకు)

ఫ్లోరిడాలో (సెప్టెంబర్ 5 నుండి 7 వరకు)

బే ఏరియా సీఏలో (సెప్టెంబర్ 8 నుండి 10 వరకు)

ఇది కూడా చదవండి: కేసీఆర్ సభ పార్కింగ్ కోసం పాఠశాల బంద్

Next Story

Most Viewed