లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కు షాక్ ఇచ్చిన కోర్టు

by Disha Web Desk 12 |
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కు షాక్ ఇచ్చిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్టు కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి.. ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. కవిత వాదనను కొట్టివేసింది. పీఎమ్ఎల్ఏ చట్టంలో సెక్షన్-19ను ఈడీ అధికారులు పాటించారని.. రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేయడంతో పాటు 24 గంటల్లోపే న్యాయస్థానం ముందు హాజరు పరిచారని కోర్టు పేర్కొంది. కాగా ఇదే కేసులో 9 సార్లు సమన్లు అందుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు.

Read More..

అరెస్ట్ భయం.. మరో సారి కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్


Next Story