- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘రాజీనామాకు నేను సిద్ధమే’.. CM రేవంత్‌కు మహేశ్వర్ రెడ్డి మరో సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ‘ఛాలెంజ్’ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఆగస్ట్ 15 లోపు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుండగానే ఈ రేస్‌లోకి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఆయన సైతం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం రూ.2 లక్షల రుణమాఫీపైనే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.. మరీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నేను కూడా సిద్ధమని మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలు నేరవేరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మరీ హరీష్ రావు సవాల్ స్వీకరించిన సీఎం రేవంత్.. రాజీనామాకు రెడీగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. మరీ మహేశ్వర్ రెడ్డి సవాల్‌పై సీఎం రియాక్ట్ అవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.