ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

by Disha Web Desk 13 |
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మార్చి 1వ తేదీననే వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 పెన్షన్ దారుల ఖాతాలలో జమ చేశారు. నెల మొదటి తారీఖుననే జీతాలు పడటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ డేట్ నే జీతాలు పడే అనవాయితీ ఉండేది. కానీ గత కేసీఆర్ హయాంలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు ఓ రోజున శాలరీలు వస్తాయో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురయ్యేవారు. ఈఎంఐలు క్లియర్ చేసుకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. డిసెంబర్ నెల జీతం జనవరి 6వ తేదీన జమ చేయగా జనవరి నెల జీతం ఫిబ్రవరి 7న జమ చేశారు. ఫిబ్రవరి జీతం డబ్బులు మార్చి 1వ తేదీననే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయశారు.



Next Story

Most Viewed