గేట్లు తెరిస్తే BRS ఖాళీ అని రేవంత్ రెడ్డి కామెంట్స్.. గంగుల కౌంటర్ ఇదే..!

by Disha Web Desk 4 |
గేట్లు తెరిస్తే BRS ఖాళీ అని రేవంత్ రెడ్డి కామెంట్స్.. గంగుల కౌంటర్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మణుగూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని గులాబీ పార్టీలో కేసీఆర్ కుటుంబమే మిగులుతుందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలబడతారని సీఎం రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ కాంగ్రెస్ లో చేరరన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎవరూ టచ్ లో లేరన్నారు. తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామన్నారు. ఐదేళ్లు పవర్‌లో రేవంత్ సర్కారు ఉండాలని కోరుకుంటున్నామన్నారు.



Next Story