హైదరాబాద్‌ వాసులు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!

by Anjali |
హైదరాబాద్‌ వాసులు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో జుమాత్ ఉల్ విద ప్రార్థనల నేపథ్యంలో మక్కా మసీదు, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజల రాకపోకలను ప్రత్యామ్నాయ రహదారుల వద్దకు మళ్లించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, చార్మినార్ - మదీనా, చార్మినార్ - ముర్గి చౌక్, చార్మినార్ - రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య వాహనాల రాకపోకలను నిషేధించారు. అలాగే నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలన మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు. శాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరి బౌలి, వోల్గా హోటల్ టీ జంక్షన్ మీదుగా వెళ్లవచ్చని సూచించారు.

కోట్ల అలిజా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను చౌక్ మైదాన్ ఖాన్ వద్ద హాఫీజ్ డంకా మసీదు, అమన్ హోటల్ వైపు మళ్లించనున్నారు. మూసాబౌలి నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను మోతిగల్లి వద్ద ఖిల్వాత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్, ఫతే మైదాన్ రహదారి మీదుగా మళ్లించారు. సుభాష్ రోడ్, మహంకాళి పీఎస్, రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ ఎంజీ రోడ్డును ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నారు.

Advertisement

Next Story