అనుమతులు లేకుండా.. అడ్డగోలుగా ‘రియల్’ దందా

by Disha Web Desk 4 |
అనుమతులు లేకుండా.. అడ్డగోలుగా ‘రియల్’ దందా
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణ శివారు మారుతి‌నగర్‌లో లే అవుట్ అనుమతి లేని ప్లాట్లను కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ దందాకు తెర లేపారు. కాగా అధికారుల కనుసన్నులోనే విక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రియల్ దందాలో కోట్లు కొల్లగొడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా ప్లాట్లు గాని వెంచర్లు చేయాలంటే ముందుగా వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చడం కోసం ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించాలి. దీంతో పాటు రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకోని నాలా పన్ను కట్టిన తర్వాత డిటిసిపి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. నలబై ఫీట్ల రోడ్డు డ్రైనేజీ వాటర్ ట్యాంకు నిర్మాణాలు చేయావల్సి ఉంటుంది.

ఒక ఎకరా భూమికి నాలుగు గుంటల భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండానే జమ్మికుంట నుండి హుజురాబాద్‌కు వెళ్లే రోడ్డు పక్కన క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed