- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాయకుల అనైక్యత వల్లనే ఆమనగల్ లో ఓడిపోయాం : కేటీఆర్
ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకుల అనైక్యత వల్ల చైర్మన్ పీఠాన్ని చేజార్చుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, ఆమనగల్ : ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకుల అనైక్యత వల్ల చైర్మన్ పీఠాన్ని చేజార్చుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో సొంత పార్టీ నాయకులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని చేజార్చుకోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. సొంత పార్టీలోని నాయకులే వెన్నుపోటు పొడిచారని అన్నారు. బీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 1స్థానం, బీజేపీ 6స్థానాల్లో గెలవగా.. మెజారిటీ స్థానాలు పొందిన బీఆర్ఎస్ ఆమనగల్ మున్సిపల్ పీఠం మన నాయకుల వెన్నుపోటు వల్లే చేజారిందన్నారు. ఈ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే ను ఉద్దేశించి కేటీఆర్ అన్నట్లు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, నాయకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.






