యువత మొత్తం మోడీ వెంటే… : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
యువత మొత్తం మోడీ వెంటే… : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులంతా నరేంద్ర మోడీకి అండగా నిలిచారన్నారని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన… యువ సమ్మేళనం శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ …గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ, యువకులకు ఉపాధి మార్గాలు చూపిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల యువతకు మార్గ నిర్దేశం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కారును అబాసుపాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోడీ వెంట యువత నిలబడాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని అన్నారు. దేశంలో ముస్లిం, మైనారిటీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ కి దక్కుతుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లో 31 శాతం, ముద్ర లోన్స్ లో 37 శాతం నిరుపేద ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా దేశం మొత్తం ఒకే చట్టం పరిధిలోకి వచ్చిందని అన్నారు. ప్రపంచంలో మన దేశంలో తప్ప మరి ఏ దేశంలోనూ ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉండదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.

నరేంద్ర మోడీకి పోటీగా నిలబడ లేకనే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ కు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా 400 ఎంపీ స్థానాలు బిజెపి గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనూ 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నామని అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయని సంబరపడుతున్నాడని ఆయనకు యువకులంతా తగిన బుద్ధి చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి గణేష్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ రాజ్, జంగయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, నాయకులు తరుణ్ రెడ్డి, దేవేందర్, నందకిషోర్, వంశీ యాదవ్, రాహుల్ రెడ్డి,బుక్క ప్రవీణ్, మహేందర్, విష్ణు వర్ధన్ రెడ్డి, విరేష్,డిఎల్ స్వామి,అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed