రంగారెడ్డి డీసీసీపై తర్జన భర్జన

by Disha Web Desk 7 |
రంగారెడ్డి డీసీసీపై తర్జన భర్జన
X

దిశ బ్యూరో, రంగారెడ్డి: తెలంగాణ కాంగ్రెస్​ కమిటీలో కేంద్ర నాయకత్వం కీలక మార్పులు చేస్తూ ప్రకటించారు. పాత, కొత్త నాయకులనే తేడా లేకుండా అందరికి ప్రాధాన్యత కల్పించారు. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ కాంగ్రెస్​పార్టీ నేతలకు పీసీసీలో ప్రాధాన్యత దక్కిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడి వర్గంగా ముద్రపడిన నేతలకు కమిటీలో సుముచిత స్ధానం కల్పించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించగా.. వికారాబాద్​జిల్లాకు గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రాంమోహన్​రెడ్డికి తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. కానీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన చల్లా నర్సింహ్మారెడ్డిని పదోన్నత్తిపై పీసీసీలో ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం చోటు కల్పించారు. దీంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పెండింగ్‌లో పెట్టారు. ఈపీఠంపై జిల్లాలోని పలువురు నేతలు కన్నేశారు.

పీసీసీలో చోటు దక్కించుకున్న నేతలు వీరే..

కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లు, యువతకు, పార్టీ విధేయులకు నూతనంగా ప్రకటించిన పీసీసీ కమిటీలో సుముచిత స్ధానం కల్పించారు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్​నగర్, రాజేంద్రనగర్​ నియోజకవర్గాల్లో క్రీయశీలకంగా పనిచేస్తున్న నాయకులకు పీసీసీలో చోటు దక్కింది. పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య​అతిథిగా, ఉపాధ్యాక్షులుగా మాజీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కొండ్రు పుష్పాలీలకు చోటు దక్కింది. రంగారెడ్డి జిల్లా నుంచి చల్లా నర్సింహ్మారెడ్డి, వీర్లపల్లి శంకర్, జ్క్షానేశ్వర్ ముదిరాజు, వేణుగౌడ్, మధుసూదన్ రెడ్డి, చిగురింత పారిజాత రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, బూపతిగళ్ల మహిపాల్, వికారాబాద్​జిల్లా నుంచి పి.రఘువీరా రెడ్డి, ధారాసింగ్లకు ప్రధాన కార్యదర్శులుగా ఏఐసీసీ నియామించింది.

జిల్లా అధ్యక్ష రేసులో..

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పెండింగ్‌లో ఉండటంతో పలువురు పోటీపడుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్​రెడ్డి రాంరెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, శేఖర్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఎనుగు జంగారెడ్డి, దేప భాస్కర్ రెడ్డిలతో పాటు మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చల్లా నర్సింహ్మారెడ్డి సైతం డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. అయితే ప్రధానంగా మల్ రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్ రెడ్డిలు డీసీసీ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. వీరి ఇద్దరూ అటు ఎమ్మెల్యే టీకెట్‌ను ఆశిస్తున్నారు. మహేశ్వరం నుంచి దేప భాస్కర్ రెడ్డి, ఎల్బీనగర్​ నుంచి మల్ రెడ్డి రాంరెడ్డిలు టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి డీసీసీ పదవి దక్కిన ఎమ్మెల్యే టికెట్​దక్కదనే ప్రచారం లేకపోలేదు.

తమకే ఆవకాశం ఇవ్వాలి..

రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేశానని, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్​కార్యకర్తల సహకారంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లానని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి దిశ ప్రతినిధితో స్పష్టం చేశారు. జిల్లాలో అధ్యక్ష పీఠంపై అనేకమంది ఆశావాహులు ఉండటంతో అధిష్టానం నియామకంలో తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో చల్లా నర్సింహ్మారెడ్డి తమకే తిరిగి అవకాశాలు ఇస్తారనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైన రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​పార్టీని బలోపేతం చేసేందుకు సరియైన నాయకత్వం అవసరమని కాంగ్రెస్​కార్యకర్తలు భావిస్తున్నారు.



Next Story

Most Viewed