చైర్ పర్సన్ నాటి ఆస్తుల విలువకు.. నేటి ఆస్తుల విలువ‌కి సంభందం ఉందా..?

by Disha Web Desk 12 |
చైర్ పర్సన్ నాటి ఆస్తుల విలువకు.. నేటి ఆస్తుల విలువ‌కి సంభందం ఉందా..?
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: పదవులు ఇప్పించిన నాయకులకు, సహచరులకు పంగనామాలు పెట్టడం పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్ పర్సన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మున్సిపల్ టిఆర్ఎస్ అధ్యక్షుడు కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద అంబర్పేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్ పర్సన్ గత మంగళవారం తనతో పాటు పలు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడారు. తాను తన కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఆర్థికంగా ఉన్నవారే అని ఎక్కడ కూడా అనాధికారికంగా కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. చెరువులో కెమికల్ మట్టి పోసి పూడుస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. చెరువుకు సంబంధించిన భూమిలో గజం భూమిని తాను ఆక్రమించిన దానికి అనుకుని ఉన్న రెండు ఎకరాల భూమిని ఉచితంగా చైర్ పర్సన్ పేరిట రాస్తానని సవాల్ విసిరారు.

ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతూ.. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ టిఆర్ఎస్ నేతలపైనే కామెంట్ చేయడం సరికాదన్నారు. ఎక్కడో కూలి పని చేసుకునే వ్యక్తులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆర్థికంగా సహకరిస్తూ కౌన్సిలర్ గా గెలిపించి ఒడిదుడుకులను తట్టుకొని చైర్ పర్సన్ పదవిని కట్టబెడితే చివరికి ఎమ్మెల్యే పైన సైతం కామెంట్లు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాన న్నారు. అదేవిధంగా తనపై వచ్చిన పలు ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. తన కుటుంబం అక్కడ కూడా అక్రమాలకు పాల్పడలేదని వివరించారు. అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొన్న కౌన్సిలర్లు హరిశంకర్, వడ్డేపల్లి విద్యావతి నాయకులు పాలడుగు నాగార్జున ప్రశాంత్ రెడ్డిలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వాటికి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఆక్రమిత భూములను సక్రమం చేసుకునేందుకే 59 నెంబర్ జీవోను విడుదల చేసిందని ప్రభుత్వ జీవోకు అనుకూలంగానే ముందుకు వెళుతున్నామని వివరించారు.

అనంతరం టిఆర్ఎస్ నాయకులు పలువురు చైర్పర్సన్ పై ఘాటుగా విమర్శలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ నాయకులతో జత కలిపి టీఆర్ఎస్ నేతలను అవమానించే విధంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చైర్ పర్సన్‌గా పదవిని ఎక్కిన రోజు తామందరం నిబద్ధతతో పనిచేశామని, చివరికి తమకు నిందలు మిగిలాయని అన్నారు. చైర్ పర్సన్ కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన రోజు కేవలం పది తులాల బంగారం ఒకటి ఆల్టో కార్ ఉందని వాటి విలువ 10 లక్షలు చూపించారని వివరించారు. కానీ నేడు 2 లక్షల మొబైల్ ఫోన్, 30 లక్షల కారు, పదికి పైగా ప్లాట్లు సంపాదించిన వి పదవిని అడ్డం పెట్టుకొని కాదా అని ప్రశ్నించారు. ఇవన్నీ వ్యాపారంలోనే సంపాదిస్తే ప్రభుత్వానికి ఎన్ని లక్షల రూపాయల టాక్స్ చెల్లించారో చూపించాలని డిమాండ్ చేశారు.

పదవిని ఎక్కక ముందు చేసిన వ్యాపారాలకు పదవిని ఎక్కిన అనంతరం సంపాదించిన ఆదాయాలను ఒకసారి ఉన్నతాధికారుల సైతం లెక్కలు పరిశీలించాల్సిన అవసరం ఉంది అన్నారు. 70 గజాల స్థలం ఉన్న లో రోడ్డును రోడ్డుపై సoపులను కబ్జా చేసి 140 గజాలకు గజాలలో ఇంటి నిర్మాణాలు చేశారన్నారు. చైర్ పర్సన్ తల్లి పేరున హయత్ నగర్‌లో ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ ఆస్తులను ఉన్నతాధికారులు పరిగణలు తీసుకొని ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంటూ ఎమ్మెల్యే తనయుడు చేపట్టిన పాదయాత్రను సైతం విస్మరించి స్వయంగా మున్సిపాలిటీ లోనే మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు హాజరు కాకపోవడాన్ని వారు ప్రశ్నించారు. రానున్న రోజుల్లో చైర్ పర్సన్, వారికి సహకరిస్తున్న మరి కొంతమంది నాయకుల అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పాశం అర్చన, పరశురామ్ కోటేశ్వరరావు విజయేందర్ రెడ్డి జగన్, మహేందర్ రెడ్డి, పాశం దామోదర్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed