జీవన్గిలో ఆగని అక్రమాలు

by Disha Web Desk 15 |
జీవన్గిలో ఆగని అక్రమాలు
X

దిశ, తాండూరు రూరల్‌ : ప్రభుత్వ ఆధీనంలోని వందలాది ఎకరాల గని భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు, నాయకుల అండదండలతో అక్రమార్కులు చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ భూముల్లోని కోట్లాది రూపాయల విలువ చేసే నాపరాళ్లను కొల్లగొట్టి దర్జాగా దోచుకుంటున్నారు. యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో నాపరాతిని తరలిస్తున్నా గనులు, రెవెన్యూ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామ శివారులో ప్రభుత్వ భూముల్లో నాపరాతి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు లేకుండానే అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నాపరాతి తవ్వకాలు జరుపుతూ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా నాపరాతి అక్రమ తవ్వకాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపడితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆయా శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Next Story

Most Viewed