రేపు రాజేంద్రనగర్ కు కేటీఆర్ రాక

by Disha Web Desk 11 |
రేపు రాజేంద్రనగర్ కు కేటీఆర్ రాక
X

దిశ, రాజేంద్రనగర్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం రాజేంద్రనగర్ రానున్నారు. ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యాంపు ఆఫీసులో సమావేశం కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించేలా ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు నేతలు పేర్కొన్నారు. కేటీఆర్ సమావేశానికి, అదే విధంగా నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.



Next Story