అంతా రెడీ..? కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి!

by Disha Web Desk 1 |
అంతా రెడీ..? కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి!
X

దిశ, తాండూరు : కారుకు ఝ‌ల‌క్ తగలనుందా.. హ‌స్తం గూటికి మ‌రో కీల‌క నేత‌.. చేరనున్నారా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు బీఆర్ఎస్‌‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే పుకార్లు శికారు చేస్తున్నాయి. ఆ నేత మ‌రెవ‌రో కాదు.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ నుంచి తెలంగాణలో పోటీ చేసే వారికి లిస్టు పెరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నది. అందులోనూ వికారాబాద్ జిల్లాకు చెందిన వారు ఒకరు సీఎం, మరొకరు స్పీకర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో చేవెళ్ల ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తనకు మంత్రి పదవినిచ్చిన పార్టీకి మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి ఈ నెల 25న లేదా 30వ తేదీల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ వస్తోంది. ఆ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తాండూరులో, జిల్లాల్లో బీఆర్ఎస్ ఓటమికి పట్నం దంపతులు రాకపోవడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి, ఈ పుకార్లపై మహేందర్ రెడ్డి క్లారిటీనిస్తారా..? లేదంటే ఆయన రీతిలో కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకొని అందరికీ షాకిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

అందరి కళ్లూ చేవెళ్ల వైపే..!

పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. దాంతో ఎవరికి వారు సత్తా చాటడానికి, టికెట్‌ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత రెడ్డి ఈ సీటుపైనే కన్నేశారు. అలాగే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మర్రి ఆదిత్య రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజకీయాల్లో నిత్యం వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోపాటు అధిష్టానం దగ్గర పలుకుబడి, గట్టిగా వాయిస్ వినిపించే సత్తా ఉన్నవారికే టికెట్లు దక్కుతుంటాయనే విషయం తెలిసిందే. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్‌కు నెలకొన్న పోటీని చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. దీంతో చేవెళ్ల లోక్‌సభ సీటుపై కాంగ్రెస్‌ నేత‌లు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఎలాగైనా సీటు ద‌క్కించుకునేందుకు ఎవ‌రికి వారు లాబీయింగ్‌ను ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ పోటీలో సీనియ‌ర్, జూనియ‌ర్, లోకల్- నాన్ లోక‌ల్ అన్న తేడా లేకుండా ఉద్ధండులు సైతం పోటీకి సై అంటున్నారు. దీంతో సీటు ఎవ‌రికి ద‌క్కుతుందోనన్న ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చేవెళ్ల సీటును అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.



Next Story

Most Viewed