హెచ్ఎండిఏ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ నిర్మాణాలు

by Disha Web Desk 23 |
హెచ్ఎండిఏ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ నిర్మాణాలు
X

దిశ శంషాబాద్ : హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులపై దాడులకు తెగబడిన ఘటన ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సింప్లెక్స్ ప్రాంతాల్లో సర్వే నెంబర్ 725/21, 725/23, 725/24 లో దాదాపు 180 ఎకరాల భూమి ఉంటుందని అందులో 30 ఎకరాలలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమి మాది అంటూ కబ్జా చేసి రేకులు వేశారని ఫిర్యాదు రావడంతో సోమవారం హెచ్ఎండిఏ అధికారి ఏఈఓ కీర్తి చంద్ర తన బృందంతో పాటు పోలీసు బందోబస్తుతో నాలుగు జెసిబిలను తీసుకొని సర్వే చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అక్రమ నిర్మాణాలకు కాపలాగా ఉన్న దాదాపు 20 మంది వ్యక్తులు హెచ్ఎండిఏ అధికారులతో పాటు జెసిబి లపై రాళ్ల దాడి కురిపించారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ రాళ్ల దాడిలో నాలుగు జెసిబి అద్దాలు ధ్వంసం కాగా, ఒక కానిస్టేబుల్ ఒక హెచ్ఎండిఏ ఉద్యోగితోపాటు ఇద్దరు జెసిపి డ్రైవర్లకు గాయాలయ్యాయి. హెచ్ఎండిఏ అధికారులు స్థానికుల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేసరికి దాడి చేసిన వారు పరారు అవుతుండగా ఐదు మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ లో హెచ్ఎండి అధికారులు దాడి చేసిన 15 మందిపై ఫిర్యాదు చేశారు.

ఎయిర్ పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ హెచ్ఎండిఎ,ఏఈఓ. కీర్తి చంద్ర బృందం హెచ్ఎండిఏ భూమిలో కొందరు ఆక్రమించారని సమాచారం రావడంతో వారి బృందం అంత వచ్చి అక్కడ సర్వే చేసి అక్రమ నిర్మాణాలను గుర్తిస్తుండగా అక్కడే ఉన్న కొంతమంది కబ్జాకు సంబంధించిన వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దాడి చేసిన వారిపై సెక్షన్ 353, 324, 427, 447, 506 సెక్షన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed