2వ నెంబర్‌కు ఓటు వేస్తే 2 లక్షల మెజార్టీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్​రెడ్డి

by Disha Web Desk 12 |
2వ నెంబర్‌కు ఓటు వేస్తే 2 లక్షల మెజార్టీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్​రెడ్డి
X

దిశ, బడంగ్‌పేట్: ప్రధాని మోడీకి ఓటు వేయాలని బీజేపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నామని, అదే రాహుల్​బాబా పేరు చెబితే ఓట్లు పోతాయని కాంగ్రెస్​పార్టీ భయపడుతుందని చేవెళ్ల పార్లమెంట్​బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతోందని, ప్రస్తుతం కాంగ్రెస్​ఆరు గ్యారంటీలను కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంత సేపు ఇతర పార్టీల మీద బురదజల్లడానికి సరిపోతుందని, ఫేక్​ వీడియోలు సృష్టించి ఓట్లు కొల్లగొడుతామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం దాపరించిందన్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్​కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్​అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్​ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వందలాది మంది బీజేపీ శ్రేణులతో కలిసి భారీ బైక్​ర్యాలీ నిర్వహించారు.

గుర్రంగూడ నుంచి ప్రారంభమైన బైక్​ర్యాలీ శ్రీ శ్రీ హోమ్స్​ మీదుగా అల్మాస్​గూడ, బడంగ్‌పేట్, సికెఆర్.. కేటీఆర్​ఫంక్షన్ హాల్, బాలాపూర్​వేణు గోపాల్​స్వామి దేవాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్​బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే ఒక్క బడంగ్ పేట్​కార్పొరేషన్ ​పరిధిలోనే 70 శాతం ఓట్లు బీజేపీకి కచ్చితంగా పడతాయన్నారు. గతంలో కాంగ్రెస్‌కు, బీఆర్​ఎస్​పార్టీలకు ఓట్లు వేసిన వారు సైతం ఈ సారి ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారన్నారు. యావత్ ​భారతదేశమంతటా కూడా ఈ సారీ మోడీ ప్రభుత్వానికి మా ఓటు అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారన్నారు.

గత ఎమ్మెల్యే ఎన్నికల ఓట్ల శాతం తో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో పదింతలు రెట్టింపు పెరుగుతుందన్నారు. కాంగ్రెస్​ఆరు గ్యారంటీలే గాడిద గుడ్లు సరిపో లేదన్నట్లు మరి కొత్తగా మరో 20 గాడిద గుడ్లు చూపెడుతున్నారన్నారు. మరోసారి మోడీకి ఓటు వేస్తే దేశం అభివృద్ధి బాటలో పయనించడంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈవిఎం మిషన్‌లో 2వ నెంబర్‌కు ఓటు వేస్తే 2లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, మాజీ సింగిల్ విండో ఛైర్మన్​ కొలను శంకర్​రెడ్డి, బడంగ్ పేట్​కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి, శురకర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed