ఓట్ ఫ్రం హోం.. హమీద్ అన్సారీ, మన్మోహన్ సింగ్, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి

by Shamantha N |
ఓట్ ఫ్రం హోం.. హమీద్ అన్సారీ, మన్మోహన్ సింగ్, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు, వికలాంగుల కోసం ఇంటి నుంచి ఓటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి తమ ఇంటి ఓటు హక్కును వినియోగించుకున్నారని ఢిల్లీ ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియ మే 24 వరకు కొనసాగనుంది.

ఢిల్లీ ఈసీ వివరాల ప్రకారం, ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో శుక్రవారం 1,409 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం అత్యధికంగా 348 మంది ఓటర్లు పాల్గొన్నారు. వారిలో 299 మంది వృద్ధులు ఉన్నారు. రెండో రోజుల వ్యవధిలో మొత్తం 2,956 మంది ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కును వాడుకున్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి మే 17న న్యూ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంటి నుండి ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ గురువారం ఓటు వేశారు.

మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ శనివారం ఓటు వేశారు. తొలిరోజు 1,482 మంది ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ అంతటా మొత్తం 5,406 మంది ఓటర్లు ఉన్నారు. ఇకపోతే.. ఢిల్లీకి మే 25న ఎన్నికలు జరగనున్నాయి.

Next Story