కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కందుకూరు మండల కేంద్రంలోని సామ నర్సింహ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మహేశ్వరం నియోజకవర్గం కుమ్మర సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సమైక్య రాష్ట్రంలో ఆదరణకు దూరంగా ఉన్న కులాలను సీఎం కేసీఆర్ గుర్తించి, కుల వృత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కుల వృత్తులు ఆర్థికంగా, సామాజికంగా బలపడేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కుమ్మర వృత్తి చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.

కాగా కుమ్మరులను బీసీఏలో చేర్చాలని కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కొత్తగూడ సర్పంచ్ మల్లారెడ్డి, సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేష్, తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ జాపాల భావన సుధాకర్, కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, నియోజకవర్గం అధ్యక్షుడు ఎగరిశేట్టి బాలయ్య, కందుకూరు మండలం అధ్యక్షుడు బొడ్డుపల్లి రవి,యూత్ అధ్యక్షుడు నరేష్,కుమ్మర కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story