క్రీడా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Disha Web Desk 11 |
క్రీడా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, ఆమనగల్లు: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపీపీ అనిత విజయ్ అధ్యక్షతన నిర్వహించిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే మాడుగుల కేంద్రంలో ఎంపీపీ పద్మ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు క్రీడా పోటీల్లో పాల్గొని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాధమ్మ, నిట్ట నారాయణ, కౌన్సిలర్లు చెన్నకేశవులు, కో ఆప్షన్ సభ్యులు శ్రీధర్, ఎంపీడీఓ ఫారూక్, ఎంపీవో శ్రీలత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed