రేషన్ షాపుల అద్దెను ప్రభుత్వమే చెల్లించాలి: రేషన్ డీలర్ల రాష్ట్ర జేఏ సీ చైర్మన్ రాజు

by Disha Web Desk 11 |
రేషన్ షాపుల అద్దెను ప్రభుత్వమే చెల్లించాలి:  రేషన్ డీలర్ల రాష్ట్ర జేఏ సీ చైర్మన్ రాజు
X

దిశ, మహేశ్వరం: రేషన్ షాపుల అద్దెను ప్రభుత్వమే చెల్లించాలని, రేషన్ డీలర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని రేషన్ డీలర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ నామకోటి రాజు డిమాండ్ చేశారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని కళాశ్రీ గార్డెన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటాలు బియ్యానికి రేషన్ డీలర్లకు 250 రూపాయలు కమీషన్ ఇవ్వాలన్నారు.

రేషన్ డీలర్లకు రూ. 30 వేల గౌరవ వేతనం,హెల్త్ కార్డులు ఇవ్వాలని, హమాలీ ఖర్చులను ఎత్తేయాలన్నారు. హమాలీ ఖర్చు, రేషన్ షాపుల అద్దెలు డీలర్లకు పెనుభారమైందన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జేఏసీ స్టేట్ వైస్ చైర్మన్ బత్తుల రమేష్ బాబు, కన్వీనర్ రవీందర్, కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు శివ యాదవ్, విజయ్ సూర్య, శ్రీనివాస్, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed