ప్రభుత్వ భూమి కాదు.. పట్టా భూమే..

by Disha Web Desk 20 |
ప్రభుత్వ భూమి కాదు.. పట్టా భూమే..
X

దిశ, శంషాబాద్ : సుల్తాన్ పల్లి గ్రామంలోని సుల్తాన్పల్లి గ్రామంలోని సర్వేనంబర్ 129, 142 సర్వే నెంబర్ లోని భూమి ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అని మల్కారం పీఎసీఎస్ మాజీ చైర్మన్ కాసుల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సుల్తాన్ పల్లి మాజీ సర్పంచ్ సిద్దేశ్వర ముదిరాజ్ శనివారం సుల్తాన్ పల్లి గ్రామంలోని 129, 142 సర్వేనెంబర్ లోని 26 ఎకరాల 10 గుంటల భూమి ప్రభుత్వ భూమని కొందరు వ్యక్తులు అక్రమంగా పాస్ బుక్కులు సృష్టించారని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం అంతా తప్పు అని అన్నారు. గ్రామంలోని 129, 142 సర్వే నెంబర్లు ఉన్న 26 ఎకరాల 10 భూమి దాని అసలు పట్టదారు వెంకట శివలింగం, వెంకట శివలింగం మృతి చెందిన అనంతరం ఆయన వారసులు పులిమామిడి నరసింహ, పులిమామిడి అశోక్, పులిమామిడి రవీందర్ పేర్ల మీద మోటేషన్ చేశారన్నారు.

ముగ్గురు పట్టాదారులు కలిపి 25 సంవత్సరంలో కాసుల చంద్రశేఖర్ గౌడ్, దూడల వెంకటేష్ గౌడ్, టీఎల్ చారీలకు సెల్ డీడీ చేశామన్నారు. 2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 142 లో అప్పటి ప్రభుత్వం గ్రామంలోని కొంతమందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో మా పట్టా పొలంలో ఇండ్ల పట్టాలు ఎలా ఇస్తారని 2007 సంవత్సరంలోనే హైకోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు కలెక్టర్కు రిఫర్ చేయడంతో వాదనలు జరిగిన అనంతరం కలెక్టర్ ఇది పట్టా భూమిగా 2022 సంవత్సరంలో ఆర్డర్ ఇచ్చారన్నారు. ఆర్డర్ ఆధారంగా ధరణీలో కూడా ఎక్కించి కొత్త పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. కొందరు గ్రామంలో ఉన్నరాజకీయ నాయకులు కావాలని కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకున్నా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed