చుక్కాపూర్ లో డుమ్మా కొట్టిన పంతుళ్లపై డీఈఓ ఆగ్రహం

by Disha Web Desk 15 |
చుక్కాపూర్ లో డుమ్మా కొట్టిన పంతుళ్లపై డీఈఓ ఆగ్రహం
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని చుక్కాపూర్ ఉన్నత పాఠశాలలో పంతులు డుమ్మా కొడుతున్నారు అనే వార్త వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మరుసటి రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా డీఈఓ సుసింధర్ రావు, తలకొండపల్లి ఎంఈఓ సర్దార్ నాయక్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఎనిమిది మంది ఉపాధ్యాయులు, ఇద్దరు కాంటాక్ట్ బేసిక్ పై విధుల్లో ఉన్నా ఎందుకు ప్రార్థనకు హాజరు కాలేదని సంబంధిత పంతుళ్లపై డీఈ ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు టీచర్లు శిక్షణ తరగతులకు వెళ్లారని, ఇద్దరు టీచర్లు లీవ్ లో ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు టీచర్లు ఒకేసారి శిక్షణ తరగతులకు వెళ్లిన సమయంలో మిగతా ఉపాధ్యాయులు లివ్ తీసుకోకూడదని, మరోసారి ఇలా జరిగినట్లు తన దృష్టికి వస్తే ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు డీఈఓ మండలం లోని చుక్కాపూర్ ప్రాథమికోన్నత, పీఎస్ లక్ష్మీ తండా, పీఎస్ సూర్య గాని తండా, కేజీబీవీ బాలికలు, అదేవిధంగా ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాల్లోని కేజీబీవీ బాలికల పాఠశాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. డీఈఓ వెంట తలకొండపల్లి విద్యాధికారి సర్దార్ నాయక్, కడ్తాల్ నోడల్ ఆఫీసర్ జంగయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed