- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణికొండలో బస్ షెల్టర్ల పునర్నిర్మాణానికి సిటిజన్స్ కౌన్సిల్ వినతి
మణికొండలోని మర్రిచెట్టు నుంచి శివాలయం వరకు బస్ షెల్టర్లను తక్షణం పున:నిర్మించాలంటూ ది సిటిజన్స్ కౌన్సిల్ టీజీఆర్టీసీ ఎండీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది.

దిశ, గండిపేట : మణికొండలోని మర్రిచెట్టు నుంచి శివాలయం వరకు బస్ షెల్టర్లను తక్షణం పున:నిర్మించాలంటూ ది సిటిజన్స్ కౌన్సిల్ టీజీఆర్టీసీ ఎండీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది. ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో నడుస్తుండగా, వందలాది మంది ప్రయాణికులు ప్రజా రవాణాపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలోని మూడు బస్ షెల్టర్లు ఆక్రమణల తొలగింపు చర్యల్లో భాగంగా తొలగించారని, ప్రస్తుతం ఆ స్థలం వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతోందనే అనుమానాలు వ్యక్తం చేసింది.
తీవ్రమవుతున్న ఎండల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మర్రి చెట్టు వద్ద బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. గతంలో ఉన్న ప్రదేశాల్లోనే బస్ షెల్టర్లు పునర్నిర్మించాలని, లేక టీజీఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ప్రజా రవాణాకు ప్రాథమిక సదుపాయాలైన బస్ షెల్టర్లు అత్యవసరమని, సామాన్య ప్రజల కోసం అధికారులు వెంటనే స్పందించాలని ది సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ సీతారాం ధూలిపాళ కోరారు.






