- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర
కార్తీక పౌర్ణమి సందర్భంగా నేటి నుంచి (బుధవారం) బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ప్రారంభం కానుంది 15 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర జరిగినన్ని రోజులు ఈ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగోతుంది.

దిశ, మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా నేటి నుంచి (బుధవారం) బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర ప్రారంభం కానుంది 15 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర జరిగినన్ని రోజులు ఈ ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగోతుంది. ఇక్కడ భక్తులు ఉదయం నుంచి దేవాలయానికి చేరుకోని కార్తీక స్నానాలు ఆచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలు, శివలింగం, తులసికోట వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు.
గుట్టపై ఉన్న కబీరుదాసు మందిరం
ఆలయ ప్రాంగణంలో అనుకోని ఉన్న గుట్ట పై కబీరుదాసు మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీరుదాసు మందిరాన్ని నిర్మించారు. ఈ రామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులంతా ఈ మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట, శివపార్వతుల సన్నిధి ఉంది. ఈ మందిరంలోనే చాలా కాలం పాటు ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు పెద్దలు చెప్తుంటారు.
బుగ్గ జాతర ప్రత్యేకత
అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమవుతుంది. దీనిని మరో దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. కాశీ వెళ్లలేని వారు ఇక్కడ కార్తీక మాసంలో గుండంలో మునిగితే కాశీకి వెళ్ళినంత పుణ్యం అని పెద్దలు చెప్తుంటారు
ఇదీ ప్రయాణ మార్గం..
ఈ జాతరకు రావాలనుకున్న భక్తులు ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకు బస్సు రావొచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది.ఈ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రయాణ సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.






