ఎస్కార్టు గా బైక్.. ఆటోలో 30 కిలోల గంజాయి తరలింపు

by Disha Web Desk 11 |
ఎస్కార్టు గా బైక్.. ఆటోలో 30 కిలోల గంజాయి తరలింపు
X

దిశ, రాజేంద్రనగర్ : బైకును ఎస్కార్ట్ గా వినియోగించి ఆటోలో 30 కిలోల గంజాయిని తరలించారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారి ఆటకు చెక్ పెట్టారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ చౌరస్తాలో 11 లక్షలు విలువచేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన దీపక్ పాటిల్, అదేవిధంగా పాతబస్తీకి చెందిన మహమ్మద్ అయాన్, మహమ్మద్ మోహినుద్దీన్ స్నేహితులు.

వీరు ముగ్గురు కలిసి గంజాయి దందా చేస్తున్నారు. భద్రాచలంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 30 కిలోల గంజాయిని అక్కడ కొనుగోలు చేసి బ్రౌన్ కలర్ ప్యాకెట్స్ గా మార్చారు. వాటిని ఆటోలో దాచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. పోలీసుల తనిఖీ విషయం తెలుసుకునేందుకు ఓ బైకును ఎస్కార్టు గా వినియోగించారు.

మైలార్ దేవు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ చౌరస్తాలో విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ముందు వస్తున్న బైకు తో పాటు ఆటోను ఆపి తనిఖీ చేశారు. వీరి నుంచి 30 కిలోల గంజాయిని, ఆటోను బైకును, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ అవగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితులపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మైలార్ దేవుపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


Next Story