- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బక్కున సంజన
ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బక్కున సంజన
by Disha Web Desk 11 |
X
దిశ, ఇబ్రహీంపట్నం :- తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బక్కున సంజన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన బక్కున చంద్రకాంత్ సుకన్యల కూతురు బక్కున సంజన. ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ… తల్లిదండ్రుల సహకారంతో, అధ్యాపకుల బోధనతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి ఈ ఘనత సాధించానని అన్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మొదటి ర్యాంకు సాధించిన సంజనకు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story