పేదల భూములే లక్ష్యంగా భూ దందా : అందెల శ్రీరాములు

by Disha Web Desk 20 |
పేదల భూములే లక్ష్యంగా భూ దందా : అందెల శ్రీరాములు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ధరణి వెబ్​సైట్తో అధికార పార్టీ ఆడిందే ఆటగా నడుస్తుందని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జీ అందెల శ్రీరాములు అన్నారు. దిశ దినపత్రికలో ప్రచురితమైన రోహిణి మినరల్స్​ మాయ కథనంపై బుధవారం అందెల శ్రీరాములు స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేతలు భూ మాయకు పాల్పడుతున్నారు. అధికారుల పై ఓత్తిడి పెంచి నిబంధనలకు విరుద్దంగా భూలావాదేవీలు చేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్​, సిలీంగ్​, భూధాన్, దేవాదాయ లాంటి భూములనే కాజేయడమే కాకుండా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పట్టా భూమలను సైతం అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్​, మ్యూటేషన్లు చేసుకోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతలు భూ లావాదేవీలపై అధికారులకు చెప్పడమే ఆలస్యం అంతే వేగంగా పనులు పూర్తి చేస్తారు.

కానీ సామాన్య ప్రజలు ప్రజాదర్భార్​ పేరుతో పాటు స్ధానిక తహశీల్ధార్​ కార్యాలయాల చూట్టు తిరిగి తిరిగి అలిసిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన భూ లావాదేవీలు నెలలు నెలలుగా పెండింగ్​లోనే ఉంటున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇంకా వేయిలాది మంది రైతులు భూ ధరణితో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్ధాయి వరకు అధికారులు నిబద్దతతో పనిచేయడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుందన్నారు. కందుకూర్​ మండలం నేదునూర్​ గ్రామానికి చెందిన అబ్దుల్​ వాహెద్ భూమిని ఎంపీ రంజిత్​ రెడ్డి అక్రమంగా మ్యూటేషన్ చేయించుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చెపట్టి ఎంపీ రంజిత్​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మ్యూటేషన్​ కోసం ప్లాట్​కు సంబంధించిన డాక్యమెంట్లు పెడితే ఏలా అప్రూవల్​ చేశారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది పేదల భూములను కాజేశారో.. ఆ భూములన్ని వెలుగులోకి రావాల్సిన అవసరముందని బీజేపీ నేత అందెల శ్రీరాములు డిమాండ్​ చేశారు.


Next Story