- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rains:ఈ జిల్లాల ప్రజలకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న(గురువారం) వర్షం బీభత్సం సృష్టించింది.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న(గురువారం) వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రదేశాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇక నిన్న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ఎక్కడ చూసినా నీళ్లు పొంగిపోర్లాయి. ఈ క్రమంలో ఈ రోజు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తులో ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతుండడంతో మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. తెలంగాణ (Telangana)లోని 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలుచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తెలంగాణలోని ములుగు, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. ఏపీలో నిన్న కురిసిన అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం కలిగింది. అరటి చెట్లు నేలకొరిగాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నేడు(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు(శుక్రవారం) అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






