సింగరేణి ప్రయివేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సింగరేణి ప్రయివేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని అన్నారు. రామగుండం గడ్డమీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా ప్రపంచం మొత్తం సంక్షోభంలో మునిగిపోయిందని, కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సంక్షోభం ఏర్పడిందని అన్నారు. అలాంటి కష్టకాలంలోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఫలితంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని వెల్లడించారు. ఇవాళ రామగుండంలో రూ.10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ పనులతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని అభిప్రాయపడ్డారు. తాము కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, తమ ప్రభుత్వంలో పనులు కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో వేగం పెంచిందని అన్నారు. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడే వాళ్లమని గుర్తుచేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎరువుల కొరత తీరనుందని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందకపోవడంతో గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతపడిందని, కొత్త టెక్నాలజీతో ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ అయిందని వెల్లడించారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టామని, ఫర్టిలైజర్‌ సెక్టార్‌ను బాగా అభివృద్ధి చేశామని అన్నారు. భూసార పరీక్షలు చేసి మరీ రైతులకు కార్డులు ఇస్తున్నామని తెలిపారు. నేల స్వభవాన్ని బట్టి పంటలు వేసుకునే వెసులుబాటు చర్యలు చేపట్టామని అన్నారు. బొగ్గు గనులపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రయివేటీకరించబోమని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed