హైదరాబాద్‌లో చికెన్ త్రిపుల్ సెంచరీ.. ఈ సీజన్‌లోనే అత్యధికానిక చేరిన ధరలు

by Malleboina Mahesh |

మాంసం ప్రియులకు, సామాన్యులకు అనూహ్యంగా పెరిగిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో చికెన్ త్రిపుల్ సెంచరీ.. ఈ సీజన్‌లోనే అత్యధికానిక చేరిన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: మాంసం ప్రియులకు, సామాన్యులకు అనూహ్యంగా పెరిగిన చికెన్ ధరలు (Chicken prices) చుక్కలు చూపిస్తున్నాయి. చలికాలం ప్రభావం, పెరిగిన డిమాండ్‌తో హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర ఏకంగా రూ. 310 కి చేరుకుంది. ఈ సీజన్‌లో నమోదైన అత్యధిక ధర ఇదేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో డిమాండ్ తగ్గకపోవడం, మరోవైపు ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ధరలు ఇలా భారీగా పెరిగాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల వివరాలు: హైదరాబాద్‌లో ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, గత వారంతో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. వివిధ నగరాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధరలు ఇలా ఉన్నాయి:

హైదరాబాద్: రూ. 280 - రూ. 310

విజయవాడ: రూ. 290

గుంటూరు/వరంగల్: రూ. 300

విశాఖపట్నం: రూ. 290

ఖమ్మం: రూ. 270 - రూ. 290

కామారెడ్డి: రూ. 280

చికెన్‌తో పాటు కోడిగుడ్డు ధర రూ. 8 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పండుగ సీజన్ కావడంతో రానున్న రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో మటన్ కేవలం రూ. 550 కి కేజీ (Mutton only Rs. 550 per kg) మటన్ దొరుకుతుంది. దీంతో మాంసం ప్రియులు ఆయా మార్కెట్లకు ఉదయాన్నే పోటెత్తుతున్నారు.

Next Story