కీలక సమావేశానికి ఏపీ ఆర్థికశాఖ మంత్రి హాజరు.. హరీశ్ రావు గైర్హాజరు

by Disha Web |
కీలక సమావేశానికి ఏపీ ఆర్థికశాఖ మంత్రి హాజరు.. హరీశ్ రావు గైర్హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల సమావేశం జరుగుతుంది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్రం సమావేశం ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ 2023- 24పై కసరత్తు చేస్తుంది. ఈ సమావేశానికి రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరు కాగా, సమావేశానికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మలాసీతారామన్ చర్చించనున్నారు. ఆర్థిక మంత్రుల ప్రతిపాదనలు తీసుకోనున్నారు. అంతేకాకుండా, కేంద్రం బడ్జెట్ లక్ష్యాలు, ప్రాధాన్యతలను రాష్ట్రాలకు తెలపనున్నారు. ప్రతి రోజు ఒక్కో రంగంతో ప్రీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.

అయితే, 2022-23లో కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా రూ. 40వేల కోట్లకు పైగా గండిపడిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఎఫ్ఆర్బీఎం పరిమితుల్లో కేంద్రం కోతలు విధించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పబడుతుంది. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని రాజకీయంగా ప్రేరేపిత, కక్ష్యపూరిత విధానాలను కేంద్రం అనుసరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రంతో తెలంగాణ అన్ని సమావేశాలకు దూరంగా ఉంటూ..కేంద్రంతో తలపడుతుంది. నిధుల విషయంలో కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంతో హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed