'కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభించొద్దు'

by Disha Web |
కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభించొద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొత్త సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభ తేదీపై కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న సచివాలయాన్ని ప్రారంభించాలని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిరసన తెలపాలని కొత్తసచివాలయం వద్దకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు ఫిబ్రవరి 17న సచివాలం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపింది. నిర్మాణ పనులు సైతం పూర్తికావొచ్చాయి.KA PaulNext Story

Most Viewed