- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పరేడ్.. రవాణా శాఖలో పోస్టుల భర్తీపై పొన్నం కీలక వ్యాఖ్యలు
పోలీసు అకాడమీలో ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పరేడ్ లో మంత్రి పొన్నం పాల్గొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. ఇవాళ రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో (Telangana Police Academy) శిక్షణ పూర్తి చేసిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లల (AMVI) పాసింగ్ ఔట్ పరేడ్ కు (Passing Out Parade) ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీఎంఐల గౌరవ వందనం స్వీకరించి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏవీఎంఐలకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం.. నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీఐలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక ప్రజాయుత కార్యక్రమాలు తెచ్చిందని దాంతో తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఏఎంవీఐలు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ శక్తి ఉపయోగించాలని యాక్సిడెంట్ లో డెత్ రేట్ తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్న వారిపై ఎన్ ఫోర్స్మెంట్ చేస్తూ కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఏఐతో వెహికిల్ ఫిట్నెస్:
రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తీసుకొచ్చి వెహికిల్ ఫిట్నెస్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. మీరంతా రవాణా శాఖలోకి రావడం వల్ల ఈ డిపార్ట్ మెంట్ మరింత పటిష్టం అయిందన్నారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడితే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ విధానం కేంద్రం తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విధుల్లో ఉన్న 300కి పైగా సిబ్బందికి రెండు నెలల చొప్పున శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో రవాణా శాఖలో నియామకం అవుతున్న వారందరికీ మీరు రోల్ మోడల్ గా ఉండాలని జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని విధంగా మంచి పేరు తెచ్చుకుంటూ తల్లితండ్రులతో పాటు మీ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.






