- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ శాఖలో ఖాళీలపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా
తెలంగాణ పోలీసు శాఖలో మంజూరైన పోస్టులు భర్తీ చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో మంజూరైన పోస్టులు భర్తీ చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ మూడేళ్లుగా పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని కోర్టుకు విన్నవించారు. పోలీసు శాఖలో వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ధర్మాసనం ప్రభుత్వం తరఫు లాయర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
Next Story






