‘ఉపకారం’ ఉత్త ముచ్చటేనా? రూ.360 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్స్

by Disha Web Desk 4 |
‘ఉపకారం’ ఉత్త ముచ్చటేనా? రూ.360 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారని మంత్రులు అంటున్నా క్షేత్ర స్థాయిలో సీన్ రివర్స్‌లో ఉంది. కార్పొరేట్ స్థాయి విద్యను పేదలకు అందిస్తున్నారని తరచూ మంత్రులు అంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యా వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, తదితర కళాశాలల్లో విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు దాదాపు మూడేళ్లుగా ప్రభుత్వం స్కాలర్ షిప్ నిధులను మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

ఆయా కళాశాలల యాజమాన్యాలు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో దాదాపు 19.25 లక్షల మంది వివిధ సామాజిక వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతోపాటు నాన్ ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు సుమారు 12 లక్షలు ఉండగా వీరికి సంబంధించి ఉపకార వేతనాలు సుమారు రూ. 650 - 750 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అలాగే సెప్టెంబర్, 2022 నుంచి డిసెంబర్, 2022 వరకు జారీ చేసిన టోకెన్లకు సంబంధించి సుమారు రూ. 360 కోట్లు చెల్లింపులు జరగలేదని తెలుస్తున్నది.

అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నాం..

-గౌరీ శంకర్, ప్రైవేట్ కళాశాలల జేఏసీ నాయకులు

గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్ షిప్స్ బకాయిలు సరైన సమయానికి రావడం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ ఎంతో భారంగా మారింది. కళాశాల అద్దె, కరెంట్ బిల్లులు, సిబ్బంది వేతనాలు ఇవ్వలేక సతమతమవుతున్నాం. విద్యసంస్థలు నడపడం చాలా కష్టాంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి.


Next Story

Most Viewed