కేసీఆర్ విషప్రయోగంలో ఈటల కూడా పాత్రధారే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్ విషప్రయోగంలో ఈటల కూడా పాత్రధారే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం ఈటల బీజేపీలో చేరారో ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లోనే స్పష్టం అవుతోందని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో రాజేందర్ బీజేపీలో చేరారు. కానీ అక్కడ కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. బీజేపీ, కేసీఆర్ ఒక్కటే అని ఈటలకు అర్థమైందన్నారు. ఈటల ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే అక్కడ తనకు ఏదో అసంతృప్తి ఉన్నట్లే కదా అన్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, వివేక్, విశ్వేశ్వర్ రెడ్డిలు బీజేపీ సిద్దాంతాలను విశ్వసించరని వారు కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తానన్నారు. బీజేపీ ఐడీయాలజితో ఆ ముగ్గురికి సంబంధం లేదన్నారు. ఈ ముగ్గురు తమ దారి తాము చూసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈటల ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

కేసీఆర్‌ను ఓడించాలని బీజేపీలో చేరినా ఆ లక్ష్యం నెరవేరండంలేదని వాళ్లకు అసంతృప్తి ఉందన్నారు. కేసీఆర్ రాజకీయ విష ప్రయోగంలో ఈటల కూడా పాత్రధారి అవుతున్నాడని, రాజేందర్‌కు ఇష్టం లేని పనులు కేసీఆర్ చేయిస్తున్నాడని ఆరోపించాడు. ఈటల లెఫ్టిస్ట్ అయినప్పటికీ రైటిస్ట్ పార్టీలో చేరేలా కేసీఆర్ చేశాడని, అలాగే ఎన్నికల్లో డబ్బులు పంచడం ఈటలకు ఇష్టం లేనప్పటికీ హుజూరాబాద్ ఎన్నికల్లో డబ్బులు పంచేలా చేయించాడని.. కేసీఆర్ అనుకున్నదే రాజేందర్‌తో చేయిస్తున్నాడని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడని, పార్టీ హైకమాండ్ భట్టికి భాధ్యతలు ఇచ్చిందన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. కలెక్టర్‌గా 21 సంవత్సరాల అధికారి బాధ్యతలు నిర్వహించగా లేనిది 21 సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదన్నారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా అంబేద్కర్ బర్త్ డే రోజు ప్రారంభిస్తే మరింత గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు అంబేద్కర్ మీద మొదటి నుంచి కక్ష అని విమర్శించారు.

Also Read....

గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి తలసాని

ఏఈపై అధికార పార్టీ ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన (వీడియో)



Next Story

Most Viewed