ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులు మనోధైర్యం ఇవ్వాలి: సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 9 |
ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులు మనోధైర్యం ఇవ్వాలి: సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న (మే 9)విడుదలైన ఇంటర్ ఫలితాల కారణంగా ఇప్పటికీ 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక ఇలాగే ఫేయిల్ అయిన విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘‘ విద్యార్థులకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఫేయిల్ అయినంత మాత్రన ఇలా చనిపోవద్దు. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై స్పందించారు. విద్యార్థులు బలవన్మరణాల విషయం తనను ఎంతగానో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. వెనకబడతామనే ఆలోచనతో పిల్లలు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచనలు చేశారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మనోధైర్యాన్ని ఇచ్చి వారికి అండగా ఉండాలని తెలిపారు.

Also Read...

టెన్త్ రిజల్ట్స్ విడుదల.. ఆ 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే!



Next Story

Most Viewed