ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మార్చుతుండు

by Disha Web Desk 15 |
ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మార్చుతుండు
X

దిశ, వీర్నపల్లి : ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి రుణ మాఫీ విషయం లో తారీఖులు మారుస్తుండని, 4 నెలలు గడిచినా ఎందుకు అమలు చేయలేదని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..2 లక్షలు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. అరచేతులో బెల్లం పెట్టి మోచేతును నాకేలా ప్రజలను మోసం చేసి కాంగ్రెసోళ్లు గద్దనెక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు సరిగా ఉండడం లేదని, ట్రాన్స్​ఫార్మర్ లు పేలి మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి పోవాలంటే కాంగ్రెస్ కు, బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. కాంగ్రెస్​ మాకు పోటీ లేదని అన్నారు.

బీజేపీ వాళ్లు గుడి కడితే ఓటెయ్యాలంటే కేసీఆర్ యాదాద్రిలో బ్రహ్మాండమైన ప్రాచీన శిలతో నవీన కళారులతో ఆలయాన్ని నిర్మించారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రూపాయి విలువ పడిపోయిందని, అన్ని ధరలు ఫిరం చేసిన వాడే మోడీ అని అన్నారు. ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్లు ఉన్నా ఇప్పుడు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదన్నారు. మోడీ దేశ సంపదను అదాని, అంబానీ లకు కట్టబెడుతున్నాడు అన్నారు. గెలిచాక బండి సంజయ్ ప్రజలకు మొఖం చూపించలేదన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకొని 15 సార్ల పైగా వచ్చారని గుర్తు చేశారు. మీ చుట్టూ తిరిగే వారిని మీ గురించి పని చేసే వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ భూలా, జెడ్పీటీసీ గుగులోతు కళావతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాప్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed