ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన పి. సుదర్శన్​రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ మంత్రి వర్గంలో కొన్ని సమీకరణాలతో తనకు మంత్రి పదవి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పి.సుదర్శన్​రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన పి. సుదర్శన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రి వర్గంలో కొన్ని సమీకరణాలతో తనకు మంత్రి పదవి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పి.సుదర్శన్​రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. బుధవారం సుదర్శన్​రెడ్డి తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారుగా బాధ్యత‌లు చేప‌ట్టారు. అంతకు ముందు తన కార్యాల‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో సుద‌ర్శన్ రెడ్డి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డిని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర‌రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పలువురు ప్రజా ప్రతినిథులు, ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్యులు ఆయన ఛాంబర్ లో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స‌లహాదారుగా తనకు బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, బీఆర్‌ఎస్‌ హ‌యాంలో పనికిరాని పథకాలతో ప్రజలపై భారం పడిందని సుదర్శన్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డులు అందజేశామని, ఉన్న పథకాలను ఇంప్లిమెంట్ చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Next Story