వికారాబాద్ విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 2 |
వికారాబాద్ విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి కార్తీక్ (8) మృతి ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కార్తీక్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్యా డైరెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సబిత వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

పూటూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న కార్తీక్ అస్వస్థతకు గురయ్యాడంటూ పాఠశాల సిబ్భంది తల్లిదండ్రులకు నాలుగు రోజుల కిందట సమాచారం అందించారు. కార్తీక్ ఇంటికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు బాలుడు మృతి చెందాడు. దీంతో స్కూల్ ఉపాధ్యాయులు కొట్టడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కార్తీక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు.



Next Story

Most Viewed