BJP హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదుకు ఆదేశాలు

by Rajesh |
BJP హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదుకు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత చేసిన ఓ పనికి ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రంలో మహిళ బురఖా తొలగించి పరిశీలించిన మాధవిలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి మాధవిలత ఓటరు కార్డులను పరిశీలించారు. పాతబస్తీలో పోలింగ్‌పై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. అజంపుర, గోషామహల్ లో అక్రమాలు జరుగుతున్నాయని సీరియస్ అయ్యారు. దొంగ ఓట్లపై ఈసీకి కంప్లైంట్ చేస్తా అని తెలిపారు.

Read More..

బ్రేకింగ్.. పాతబస్తిలో మాధవి లత నిరసన

Next Story

Most Viewed