దశాబ్ది ఉత్సవాల వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
దశాబ్ది ఉత్సవాల వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. అవతరణ వేడుకల్లో భాగంగా మొదట గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సచివాలయంలో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు.

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే అదృష్టం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి రంగంలోనూ తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. శాంతియుతంగా మలిదశ ఉద్యమం సాగిందన్నారు. ఉద్యమంలో అన్ని వర్గాలు కదిలాయన్నారు. నేటి నుంచి 21 రోజులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమే అన్నారు. అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నామన్నారు. దేశంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేళ పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందామన్నారు.

1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.. పోడు భూములకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనక మానవీయ కోణమే ఉంటుందన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.

గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపడతామన్నారు. దళిత బంధును ఇప్పటివరకు 50 వేల మంది లబ్ది దారులకు అందించామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు గ్రాంట్ గా ఇస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 47వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు లభించాయన్నారు. స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నారు. గతంలో పవర్ హాలీడేలో పరిశ్రమలు


Next Story

Most Viewed