ప్రజల నెత్తిన బాకీ పాపం బీఆర్ఎస్ దే : ఏఎంసీ డైరెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్ రావు

by Ratna Kumari |

దిశ‌, మాక్లూర్ : ప్ర‌భుత్వ భూములు అమ్ముకుని ప్ర‌జ‌ల సొమ్మును దండుకొని చివ‌రికీ రాష్ట్రాన్నీ అప్పుల ఊబిలోకి నెట్టిన ఘ‌న‌త కేసీఆర్ దే అని ఏఎంసీ డైరెక్ట‌ర్ వెంకటేశ్వర్ రావ్ అన్నారు. ల

ప్రజల నెత్తిన బాకీ పాపం బీఆర్ఎస్ దే : ఏఎంసీ డైరెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్ రావు
X

దిశ‌, మాక్లూర్ : ప్ర‌భుత్వ భూములు అమ్ముకుని ప్ర‌జ‌ల సొమ్మును దండుకొని చివ‌రికీ రాష్ట్రాన్నీ అప్పుల ఊబిలోకి నెట్టిన ఘ‌న‌త కేసీఆర్ దే అని ఏఎంసీ డైరెక్ట‌ర్ వెంకటేశ్వర్ రావ్ అన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులను ప్రజల నెత్తిన వేసిన పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని గుర్తుచేశారు. మండల కేంద్రం మాక్లూర్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు పంచిపెడుతున్న బాకీ కార్డుల గురించి మాట్లాడుతూ ఆయన ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు బీఆర్ఎస్ బాకీ భారాన్ని మోపితే తమ ప్రభుత్వం హామీ ఇస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ప్రజా సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజల వద్దకు వెళ్లే అర్హత లేదని ఏద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు, రైతు రుణమాఫీ, బోనస్, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలెండర్ వంటి అనేక పథకాలు పేదలకు, రైతులకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులను ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రవి, సొసైటీ చైర్మన్ అశోక్, గంగాధర్ గౌడ్, దయాకర్, రాజు పాల్గొన్నారు.

Next Story