- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. కాపర్ కాయిల్, ఆయిల్ చోరీ
నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. కాపర్ కాయిల్, ఆయిల్ చోరీ
by Bhanu |
మండలంలోని బినోల, నిజాంపూర్ గ్రామాలలోని 16 వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తున్న నిజాంపూర్ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ వద్ద గుర్తుతెలియని దుండగులు 8 లక్షల విలువైన 250 కె.వి.ఎ. ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్ తో పాటు ఆయిల్ ను చోరీ చేశారు.

X
దిశ, నవీపేట్ : మండలంలోని బినోల, నిజాంపూర్ గ్రామాలలోని 16 వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తున్న నిజాంపూర్ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ వద్ద గుర్తుతెలియని దుండగులు 8 లక్షల విలువైన 250 కె.వి.ఎ. ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్ తో పాటు ఆయిల్ ను చోరీ చేశారు. ప్రతిరోజు మాదిరి లిఫ్ట్ పంప్ హౌస్ వద్దకు వెళ్లిన రైతులకు ట్రాన్స్ఫార్మర్ కింద పడడాన్ని గమనించి ఇరిగేషన్ మరియు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇరిగేషన్ ఏ.ఈ. ప్రణయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కే.వినయ్ తెలిపారు. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ దొంగలు లిఫ్ట్ పథకం ట్రాన్స్ఫార్మర్ ని ద్వంసం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Next Story






