ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి.. సీపీకి కోటపాటి వినతి

by Disha Web Desk 11 |
ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి.. సీపీకి కోటపాటి వినతి
X

దిశ, నిజామాబాద్ క్రైం: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కోటపాటి నరసింహం నాయుడు పోలీసు కమిషనర్ కేఆర్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నరసింహం నాయుడు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం, అలాగే గల్ఫ్ కు పంపిస్తామని మోసాలకు పాల్పడిన ఏజంట్లపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల కోసం, పోరాటం చేస్తున్నా తనకు కొందరూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని చెప్పారు. ఆర్మూర్ ఏరియా సామాజిక సేవ చేస్తూనే 2013లో మైగ్రేంట్స్ రైట్స్ అండ్ ఫోరం స్థాపించి దానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ పోరాటం చేస్తున్నానన్నారు. జిల్లాలో ఇద్దరు ఏజంట్లు చిక్కేల స్వామి, షేక్ బషీర్ లు వందలాది మంది అమాయకులను గల్ఫ్ దేశాలకు పంపిస్తామని మోసగించారని ఆరోపించారు.

దానిపై తాను స్పందించి, చట్టపరిధిలో పోరాటం చేస్తున్నానని, నకిలీ ఏజంట్ల అందరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. తనకు వ్యతిరేకంగా ఇటీవల 300 మంది ఏజెంట్లు మెట్ పల్లిలో సమావేశమై నన్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిసిందన్నారు. అందులో భాగంగానే ఆదివారం, జనవరి 18న, గత డిసెంబర్ 30న ఓ గుర్తుతెలియని వ్యక్తి +919475850935 నుంచి కాల్ చేసి 'మొన్న నువ్వు దుబాయ్ వచ్చినప్పుడు నిన్ను చంపుదామని తిరిగినం నీ నెంబర్, అడ్రస్ తెలియక బతికి పోయినవ్ నిన్ను వదిలిపెట్టం' అని బెదిరించాడు అన్నారు. తాను ఎప్పటికప్పుడు ఆర్మూర్ లో ఫిర్యాదు చేయగా దీనిపై ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు అయింది కానీ, నిందితులను ఇంతవరకు గుర్తించలేదన్నారు. కాబట్టి తనకు ప్రాణహాని ఉందని, గన్ మెన్ ల ద్వారా తనకు భద్రత కల్పించి ప్రాణాలు కాపాడాలని కోరారు.


Next Story

Most Viewed