దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ : మంత్రి హరీష్ రావు
X

దిశ, ఎల్లారెడ్డి : దేశంలో మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్య, ఆరోగ్య శాఖలో మూడో స్థానంలో ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వంద పడక ఆసుపత్రి నిర్మించి, అందులో మెరుగైన వైద్య సేవలందించే విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీను ప్రారంభించారని వైద్య వృత్తి కొరకు ఇతర దేశాలకు విద్యార్థులు వెళ్లకుండా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని తెలిపారు.

రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ.13 వేల కోట్లు కేవలం పేదల వైద్యం కొసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జడ్పీటీసీ ఉషా గౌడ్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, జిల్లా వైద్యాధికారి, వైద్య సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed